బాబర్ అజామ్.. సంచలన రికార్డు?

praveen
పాకిస్తాన్ క్రికెట్ లో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక అత్యుత్తమ క్రికెటర్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా ఛేదిస్తూ ఉన్నాడు. తన అద్వితీయమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంటూ ఉన్నాడు. అతను ఎవరో కాదు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఒకవైపు కెప్టెన్గా జట్టు బాధ్యతలను చూస్తూనే మరోవైపు అటు కీలక బ్యాట్స్మెన్గా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు.


 ఇప్పటికే తన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన బాబర్ అజామ్ ఇంకా తన రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంటూనే ఉన్నాడు.. ఇప్పటికే సెంచరీల లో విరాట్ కోహ్లీ ని వెనక్కి నెట్టిన బాబర్ అజామ్.. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించాడు. వన్డే ఫార్మాట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 16 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు బాబర్ అజామ్. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఇక ఆతిథ్య పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వన్డే సిరీస్లో భాగంగా ఇటీవలే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.


 ఏకంగా 105 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో వన్డే ఫార్మాట్ క్రికెట్లో మొత్తంలో 16 సెంచరీలు సాధించాడు బాబర్ అజామ్.  అయితే కేవలం 84 మ్యాచ్లోనే బాబర్ అజామ్ ఈ అరుదైన రికార్డు  సాధించడం గమనార్హం. దీంతో అత్యంత  వేగంగా 16 సెంచరీలు సాధించిన క్రికెటర్ గా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేశాడు  హషీమ్ ఆమ్లా 94 వన్డేల్లో 16 సెంచరీలు సాధించాడూ. ఇక విరాట్ కోహ్లీ 110 వన్డే లో 16 సెంచరీలు సాధించడం గమనార్హం.  కాగా ప్రస్తుతం హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టి టాప్ ప్లేస్ లోకి దూసుకు వచ్చాడు బాబర్ అజామ్.  ఆ తర్వాత హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ వరుసగా రెండో స్థానంలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: