నా కెరీర్లో.. ఆ 35 పరుగులే విలువైనవి : కోహ్లీ

praveen
దాదాపు 28 ఏళ్ల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరూ నిరీక్షణకు తెరపడింది ఇదే రోజు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2011లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఇప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇక టీమిండియా 28 ఏళ్ల తర్వాత 2011లో వరల్డ్ కప్ సాధించింది. ఇక ఈ వరల్డ్ కప్ సాధించి దాదాపు పదకొండు అవుతుంది. ఈ క్రమంలోనే అప్పటి అనుభూతులను అనుభవాలను అందరూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు భారత క్రికెట్ ఆటగాళ్లు. అప్పుడు వరల్డ్ కప్ ఆడిన ఎంతోమంది ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు గా మారిపోయారు.


 2011 వరల్డ్ కప్ గెలవడం లో ప్రస్తుత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం కీలక పాత్ర వహించాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 2011 వరల్డ్ కప్  విజయం సాధించిన క్షణాలను  ఇటీవలే మరోసారి నెమరు వేసుకున్నాడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తాను సాధించిన 35 పరుగుల తన కెరియర్లో ఇప్పటికీ అత్యంత విలువైన పరుగులు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. టీమిండియా అప్పుడు రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడి నేటికీ 11 ఏళ్లు గడుస్తున్నా నేపథ్యంలో ఇక ఇక వరల్డ్ కప్ విశేషాలను పంచుకున్నాడు. సచిన్ 18 పరుగులకు  వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరుతూన్నాడు అదే సమయంలో నేను క్రీజ్లోకి వెళ్తున్నాను.


 సచిన్ నాతో ఒక మాట చెప్పాడు. గంభీర్ తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాలి అంటూ సూచించాడు. నేను సచిన్ మాటను గుర్తు పెట్టుకుని.. అదే చేశాను గౌతం గంభీర్ తో కలిసి మూడో వికెట్కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించాను. ఆరోజు ప్రపంచకప్ ఫైనల్లో 35 పరుగులు చేశా.. ఇక నా కెరియర్లో ఇప్పటికీ అవి అత్యంత విలువైన పరుగులే అంటు చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఎందుకంటే జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో గంభీర్ తో కలిసి జట్టును గాడిలో పెట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ఆ రోజు ప్రపంచ కప్ గెలిచిన క్షణాలు ఎంతో అద్భుతం ఇప్పటికీ మర్చిపోలేను అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: