ధోని ఇచ్చిన షాక్ తో.. క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్న సురేష్ రైనా?

praveen
మొన్నటివరకు టీమిండియాలో సురేష్ రైనా కీలక ఆటగాడిగా కొనసాగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ధోనీతో సన్నిహితుడిగా కొనసాగాడు సురేష్ రైనా. అందుకే ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగానే గంటల వ్యవధిలోనే సురేష్ రైనా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సురేష్ అటు తన సన్నిహితుడైన ధోనీతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ లో మాత్రం క్రికెట్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు అనే విషయం తెలిసిందే.



 అయితే ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తూ మిస్టర్ ఐపీఎల్ గా పేరు సంపాదించుకున్న సురేష్ రైనా  ఇక ఇటీవల జరిగిన మెగా వేలంలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. చెన్నై జట్టుకు ఎన్నో విజయాలను అందించిన సురేష్ రైనా ను చెన్నై సూపర్ కింగ్స్ పక్కనపెట్టేసింది. అదే సమయంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే ఇక అమ్ముడుపోని ఆటగాడిగా సురేష్ రైనా మిగిలిపోయాడు. అయితే ఇక ధోని ఇచ్చిన షాక్ తో అభిమానులు అందరూ కూడా షాక్ లో ఉన్నారు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని మళ్ళీ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ అది కుదరలేదు.


 ఐపీఎల్లో ఆటగాడిగా దూరమైపోయిన సురేష్ రైనా ఐపీఎల్ సీజన్ లో కొత్త అవతారం ఎత్తాడు. కామెంటేటర్ గా మారిపోయాడు. ఇక అతనితో పాటు పియూష్ చావ్లా, కులకర్ణి, టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి, హర్భజన్ సింగ్ తొలిసారి  ఐపీఎల్ కామెంటరీ ప్యానల్ లో కనిపించారు. దీంతో సురేష్ రైనా పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ రైనా 35 ఏళ్లు కూడా నిండిపోయాయి. ఐపీఎల్ లో కూడా అవకాశం రావడం లేదు. దీంతో పూర్తిగా క్రికెట్నుండి సురేష్ రైనా తప్పుకుంటున్నాడూ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: