సన్రైజర్స్ లో.. అతను చాలా కీలకం?

praveen
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి సరికొత్తగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది అని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మెగా వేలం కారణంగా ఎంతో మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చిన నేపథ్యంలో ఇక సన్రైజర్స్ ఆట తీరులో మార్పు రావడం ఖాయం అని భావించారు. కానీ మొదటి మ్యాచ్ లోనే సన్రైజర్స్ ఆట తీరు మారలేదు అన్నది అర్థమైంది. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న రేంజ్లో సన్రైజర్స్ పేలవ ప్రదర్శన చేసి నిరాశపరచింది అని చెప్పాలి.


 ఎందుకంటే ప్రత్యర్థి రాజస్థాన్కు  ఎక్కడా కనీస పోటీ ఇవ్వకుండా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇలాంటి సమయంలోనే ఇక సన్రైజర్స్ మళ్లీ అద్భుతంగా రాణించగలదా అనే అనుమానం కూడా ప్రేక్షకుల పెరిగిపోయింది. అయితే ఇక ఇదే విషయంపై మాట్లాడినా హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగ్లో పరుగులు సమర్పించుకున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం 14 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఎంతో అద్భుతంగా ఆడాడని గుర్తు చేసాడు టామ్ మూడి.


 వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆల్రౌండర్ అని గుర్తుంచుకుని మెగా వేలంలో కొనుగోలు చేశాం అంటూ చెప్పుకొచ్చిన టామ్ మోడీ.. అందుకే వచ్చే మ్యాచుల్లో ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు బౌలింగ్ లో కూడా వాషింగ్టన్ సుందర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు అని భావిస్తూన్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.కానీ అది అతనికి శాశ్వతం కాదు ఏ స్థానంలో నైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక క్లిష్ట సమయంలో ఎంతో హుషారుగా అవకాశ వాద దృక్పథంతో  వుండాలని కేన్ విలియమ్సన్ తన సహచరులకు సూచించాడు అంటు టామ్ మూడి గుర్తు చేసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: