ఐపీఎల్ కోసం.. క్రిస్ గేల్ రెడీ అవుతున్నాడు?
ఎందుకంటే ఇప్పటివరకు క్రిస్ గేల్ ఐపీఎల్ లో సృష్టించిన విధ్వంసాలు అలాంటివి. ఎడాపెడా బౌండరీలు సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్లతో ఒక ఆట ఆడుకుంటున్నాడు క్రిస్ గేల్. అయితే ఇక ఈ సారి క్రిస్ గేల్ ఐపీఎల్ లో లేడు అన్న విషయాన్ని ఎంతో మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి క్రిస్ గేల్ తన పేరును నమోదు చేసుకోకపోవడం గమనార్హం. ఒకవేళ మెగా వేలం లోకి వచ్చి ఉంటే అతని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎంతగానో పోటీపడి ఉండేది.
ఇకపోతే ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచారు విధ్వంసకర బ్యాట్స్మెన్. ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే 2022 సీజన్ కాదు 2023 లో జరగబోయే ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివర్లో 43 ఏళ్ళు నిండుతాయి. అయినప్పటికీ యువ ఆటగాళ్లకు ఎక్కడ తక్కువ కాదు అంటూ చెబుతున్నాడు ఈ స్టార్ క్రికెటర్. ఐపీఎల్లో ఇప్పటివరకు మూడు ఫ్రాంఛైజీల కు ప్రాతినిధ్యం వహించాడు క్రిస్ గేల్ 2009లో కోల్కత్తా ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇక మొన్నటి ఏడాది వరకు కూడా పంజాబ్ కింగ్స్ జట్టు లో కొనసాగాడు.