వారెవ్వా.. 3 సీజన్లలో కూడా ఔరా అనిపించాడు?

frame వారెవ్వా.. 3 సీజన్లలో కూడా ఔరా అనిపించాడు?

praveen
సంజూ శాంసన్ .. ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడ లేమీ కారణంగా సంజూ శాంసన్ పెద్దగా టీమిండియాలో అవకాశాలు దక్కించుకోవడం లేదు.  ఒకవేళ టీమిండియాలో అవకాశం వచ్చినా కూడా ఇక చివరికి పేలవ ప్రదర్శన చేస్తూ అందరినీ నిరాశపరుస్తూ ఉంటాడు . అందుకే ఎప్పుడో ఒకసారి తప్ప తరచూ టీమిండియాలో సంజూ శాంసన్ చూడ లేము అని చెప్పాలి.. కానీ అటు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంజూ శాంసన్ మరింత అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు.


 వాస్తవానికి సంజూ శాంసన్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. ఎలాంటి బంతిని అయినాసరే అటు బౌండరీ అవతలికి తరలించగా సత్తా ఉన్నోడు. బౌలర్ ఎవరైనా సరే భారీ పరుగులు చేయగల సమర్ధుడు. కానీ ఎందుకో సంజూ శాంసన్ మెరుపులు కేవలం రెండు మూడు మ్యాచ్లకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ లాగా ఇక పరుగులు చేయడానికి తెగ ఇబ్బందులు పడిపోతూ వుంటాడు సంజు శాంసన్. అంతకుముందు అలవోకగా సెంచరీలు చేసిన వాడు ఆ తర్వాత మాత్రం రెండంకెల స్కోరు చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు.  ఇకపోతే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.


 ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఎప్పటిలాగానే అద్భుతమైన ఆరంభం చేశాడు. ఇటీవల జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ బౌలర్లతో ఒక ఆట ఆడుకున్న సంజూ శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక జట్టు భారీ స్కోరు చేయడంలో సంజూ శాంసన్ పాత్ర కూడా ఎంతో కీలకం గా ఉంది అని చెప్పాలి. అంతే కాకుండా నిన్న జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు సంజూ శాంసన్. కేవలం ఈ ఒక్క సీజన్ లోనే కాదు దాదాపు గత మూడు సీజన్స్ నుంచి కూడా ప్రారంభ మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శన తో అందరిని ఫిదా చేస్తున్నాడు సంజు శాంసన్.


 ఇక ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే... 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మొదటి మ్యాచ్లో ఏకంగా 32 బంతుల్లోనే 74 పరుగులు చేసి ఔరా అనిపించాడు ఈ యువ ఆటగాడు. ఇక 2021లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 23 బంతుల్లో 119 పరుగులు చేసి సెంచరీతో చెలరేగిన పోయి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఇక ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో 53 పరుగులు చేసి మరోసారి అదరగొట్టాడు సంజూ శాంసన్. ఇక దీంతో అభిమానులు అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: