అయ్యో.. ఐపీఎల్ స్టార్ట్.. ఇలా జరిగిందేంటి?

praveen
సాధారణంగా ప్రతి ఏడాది అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా దేశీయ లీగ్ లు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఎందుకో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్  కి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే రిచ్చెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ఒక్కసారి ఐపీఎల్ లో పాల్గొంటే ఒకవైపు గుర్తింపుతో పాటు మరోవైపు భారీగా ఆదాయం కూడా వస్తుందని ప్రతి ఆటగాడు నమ్ముతూ ఉంటాడు.. అందుకే ఐపీఎల్ లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.


 ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంతగా గుర్తింపు సంపాదించుకున్న ఐపీఎల్ ప్రారంభం అవుతుంది అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఐపీఎల్ లో మొదటి బంతికి ఎంతో అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఉంటారు. బ్యాట్స్మెన్ భారీ సిక్సర్ కొట్టడం లేదా బౌలర్ వికెట్ పడగొట్టడం లాంటివి జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. ఇకపోతే అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.


 ఇక ఈ మ్యాచ్లో భాగంగా మొదటి బంతికి ఏదైనా మ్యాజిక్ జరగబోతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కోల్కతా నైట్రైడర్స్ నుంచి ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేశాడు ఇక మరోవైపున రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేశాడు. ఈ క్రమంలోనే మొదటి బంతిని వేసాడు ఉమేష్ యాదవ్. మొదటి బంతిని అద్భుతంగా సంధించాడు అని అందరూ అనుకుంటున్న సమయంలోనే అంపైర్ అది నో బాల్ అంటూ ప్రకటించాడు. ఇలా ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ ఉమేష్ యాదవ్ వేసిన నో బాల్ తో మొదలయింది అని చెప్పాలి. ఇక ఇది తెలిసి అభిమానులు ఐపీఎల్ ఇలా మొదలైంది ఏంటి అని అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: