టీమిండియాకు మరొకరు కావాలి : రవి శాస్త్రి

praveen
టీమిండియాలో గత కొంత కాలం నుంచి ఆల్రౌండర్ల కొరత ఎంత వేభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి భారత జట్టు నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత ఇక క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చే ఆటగాడు భారత జట్టులో కనిపించడం లేదు. కొంత మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు అని అనిపించినప్పటికీ కేవలం కొన్ని మ్యాచ్ లకు మాత్రమే ఆ మెరుపులు పరిమితమవుతున్నాయి. దీంతో ఇక నిలకడగా రాణిస్తూ ప్రతి మ్యాచ్లో ఫినిషర్ పాత్ర పోషించే ఒక ఆల్ రౌండర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ముఖ్యంగా ముఖ్యంగా ఐదు ఆరు స్థానాలలో సరైన ఆల్రౌండర్ లేకపోవడం టీమ్ ఇండియాకు ఎన్నోసార్లు మైనస్ గా మారిపోయింది.


 ఇటీవలి కాలంలో టీమిండియా లో రవీంద్ర జడేజా రాణిస్తూ ఉన్నప్పటికీ అతనికి మరో వైపు నుంచి సహకారం అందించేందుకు ఎవరు ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఇక బౌలర్లు బ్యాటింగ్ కి వచ్చి వరుసగా వికెట్లు కోల్పోతూ ఉండడంతో ఇక రవీంద్ర జడేజా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన మద్దతు అందకపోవడంతో టీమిండియా కొన్ని కొన్ని సార్లు ఓటమి కూడా  చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.



 టీమిండియాలో ఆరవ స్థానంలో రాణించగా ఆల్రౌండర్ అవసరం ఎంతైనా ఉంది అని రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు. వెన్నెముక గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రావాలి అంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. టాప్ ఫైవ్ లో ఎవరో ఒకరు రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉంటే కెప్టెన్ కి ఒత్తిడి ఎంతగానో తక్కువ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా జట్టులోకి రావాలి అంటే తప్పకుండా ఆల్రౌండ్ ప్రదర్శన చేయాల్సిందే అంటూ తెలిపాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: