ఐపీఎల్ : సెంచరీలతో టాప్ లో ఉన్న జట్లు ఇవే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అసలు సిసలైన టీ20 ఫార్మాట్ కి కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా ప్రతి ఒక ఆటగాడి ప్రతిభకు ఒక అతిపెద్ద సవాల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లందరూ కూడా ఒకేచోట కనిపిస్తూ ఉంటారు. ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లందరూ కూడా సహచరులుగా మారిపోయి హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు. అందుకేనేమో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో క్రీజులోకి వచ్చే ప్రతి ఆటగాడు ధన ధన అనే రేంజ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.


 ఇక అలా కాకుండా ఎవరైనా కాస్త స్లోగా బ్యాటింగ్ చేశారు అంటే చాలు.. అతను ఏంట్రా బాబు మరీ ఇంత స్లో గా బ్యాటింగ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే  తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు.  క్రీజులోకి వచ్చి ఆటగాడు ఎలాంటి బంతినైనా సరే సిక్సర్లు ఫోర్లు గా బాదుతూ వుంటే తెగ ఆనంద పడిపోతూ ఉంటారు. ఇక ఐపీఎల్ లో అప్పుడప్పుడు కొంత మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించి ఏకంగా సెంచరీలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు..  ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గతంలో సెంచరీలతో టాప్ లో కొనసాగుతున్న జట్లు ఏవి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.


 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 14 సెంచరీలతో టాప్ లో కొనసాగుతుంది. ఇక మరో విషయం ఏంటంటే ఈ జట్టు ఒక సారి కూడా టైటిల్ గెలవలేదు. ఇక ఆ తర్వాత 13 సెంచరీలతో పంజాబ్ కింగ్స్ జట్టు రెండవ స్థానంలో ఉంది. ఇక అటు వెంటనే యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 సెంచరీలు చేసింది. ఐపీఎల్ లో ఛాంపియన్గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది సెంచరీలు చేసింది.  టైటిల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది సెంచరీలు చేసింది. ఐపీఎల్ ఛాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్ కేవలం 4 సెంచరీలు మాత్రమే చేయడం గమనార్హం. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు సెంచరీలు చేసింది. ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క సెంచరీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: