ప్రపంచకప్ లో అతి పెద్ద సిక్సర్.. కొట్టింది ఎవరో కాదు?
ఇక ఈ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇప్పటి వరకూ ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా అతి పెద్ద సిక్సర్ నమోదయింది. అయితే ఈ సిక్సర్ బాదింది ఎవరో కాదు భారత బ్యాటర్ కావడం గమనార్హం. టీమిండియా బ్యాటర్ పూజ వస్త్రాకర్ మహిళల ప్రపంచ కప్ 2022 లో అతి భారీ సిక్సర్ కొట్టి రికార్డు సృష్టించింది. దీంతో ఇక ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారిపోయింది.. దీనికి సంబంధించిన వీడియోని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇక ఈ అతి భారీ సిక్సర్ కొట్టింది టీమ్ ఇండియా బ్యాటర్ పూజ వస్త్రాకర్. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పూజ.. ఆసీస్ పేసర్ మెగాన్ షట్ వేసిన బంతిని సిక్సర్ బాది ఔరా అనిపించింది. మహిళల ప్రపంచ కప్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యంత భారీ సిక్సర్ కావడం గమనార్హం. అంతకుముందు ఈ మెగా టోర్నీలో భారత బ్యాటర్ స్మృతి మందాన, సౌత్ ఆఫ్రికా క్రీడాకారిణి క్లో టైరన్ లు 80 మీటర్ల సిక్సర్ కొట్టారు. ఇక తాజాగా పూజ వస్త్రాకర్ రికార్డులను అధిగమిస్తూ ఏకంగా 81 మీటర్ల సిక్స్ బాదింది. అయితే ఇక ఈ మ్యాచ్లో ఎంతో వీరోచితంగా పోరాటం చేసిన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.