ఈ రోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఇండియాకు ఒక క్వార్టర్ ఫైనల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ముందు వరకు ఇండియా ఆడిన 4 మ్యాచ్ లలో 2 మాత్రమే గెలిచి సెమీస్ ఆశలను కష్టం చేసుకుంది. అందుకే ఈ మ్యాచ్ గెలిస్తే కానీ సెమీస్ పై ఆశలు పెట్టుకోవడం వీలు కాదు. ఇలాంటి దశలో ఇండియా అద్భుతంగా ఆడాల్సింది పోయి, చిన్న గ్రౌండ్ మీద సాధారణ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 277 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ లో మిథాలీ, యాస్తిక మరియు హర్మన్ ప్రీత్ కౌర్ లు అర్థ సెంచరీలు చేశారు. అయితే ఈ లక్ష్యం ఆస్ట్రేలియా మహిళలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేక పోయింది. దానికి ఇండియా బౌలర్లు అంత ప్రభావవంతంగా ప్రదర్శన చేయలేకపోవడంతో ఆడుతూ పాడుతూ ఆస్ట్రేలియా మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో టోర్నీలో 5 వ వరుస మ్యాచ్ ను గెలిచి సెమీస్ కు చేరిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది. ఇక ఆడిన 5 మ్యాచ్ లలో 3 ఓడిపోయి సెమీస్ అవకాశాలను మరింత కష్టం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇండియా సెమీస్ చేరాలంటే దాదాపు కష్టమే. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలవడం మాత్రమే కాదు... భారీ తేడాతో గెలిచి రన్ రేట్ ను పెంచుకుంటే, అప్పుడు కూడా మిగిలిన జట్ల గెలుపు ఓటములపై ఆధారపడి ఉంటుంది.
ఇక మిగిలిన రెండు మ్యాచ్ లు బంగ్లాదేశ్ తో ఒకటి మరియు సౌత్ ఆఫ్రికా తో ఒకటి. బంగ్లాదేశ్ తో గెలవడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ భారీ తేడాతో గెలిచేందుకు 100 శాతం ప్రయత్నించాలి. ఇక మిగిలిన మరో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడున్న ఫామ్ లో ఓడించడం కొంతవరకు కష్టమే. కాబట్టి ముందు ముందు జరిగే మ్యాచ్ లు ఇండియా సెమీస్ కు చేరడానికి చాలా కీలకం కానున్నాయి.