రైనా ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు?

praveen
అతను ఓ గొప్ప ప్లేయర్.. ఒకసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలడు. ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో సేవలందించాడు. ఇక అటు ఐపీఎల్లో అయితే కొద్దిమందికి మాత్రమే సాధ్యం అయినా 5 వేల పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడవ స్థానంలో బరిలోకి దిగుతూ మార్చి స్వరూపాన్ని మార్చేయగల సమర్ధుడైన ఆటగాడు. అలాంటి ఆటగాడికి ఇటీవలే ఐపీఎల్లో అవమానమే జరిగింది. అతను ఎవరో కాదు సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో కి వదిలేసి మళ్ళీ కొనుగోలు చేయలేదు.

 అదే సమయంలో ఇక మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా సురేష్ రైనా ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఇక ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన సురేష్ రైనా చివరికి అన్ సోల్డ్ గా మిగిలి పోవాల్సినా పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇక సురేష్ అయినా ఐపీఎల్లో ఎంపిక కాకపోవడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశ చెందారూ అని చెప్పాలి. కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పై విమర్శలు కూడా చేశారు. ఇకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయే ఒక శుభవార్త అందింది. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సురేష్ రైనా. అయితే ఆటగాడిగా కాదు కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.


 సురేష్ రైనా తో పాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం ఇక ఐపీఎల్  లో వ్యాఖ్యాతగా మారబోతున్నాడట. రైనా ఐపీఎల్ లో భాగం కావడం లేదని అందరికీ తెలుసు.. అయితే మేము అతన్ని తిరిగి లో చూడాలనుకుంటున్నాము.. రైనాకు  అభిమానులు ఎక్కువ.. ముద్దుగా అతన్ని  మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. అతడు తిరిగి వస్తే బాగుంటుంది. రవి శాస్త్రి  తో కలిసి సురేష్ రైనా కూడా కామెంటేటర్ గా ఉండడం బాగుంది అనుకుంటున్నాము అంటూ బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయ్ తెలుస్తోంది. ఇక ఏదో ఒక విధంగా సురేష్ రైనా ఐపీఎల్ లో కనిపిస్తుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: