భారత్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక బెంబేలు... గ్రాండ్ విక్టరీ
ఇందులో శ్రేయాస్ అయ్యర్ 92 మరియు పంత్ 39 పరుగులు చేసి ఈ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకే కుప్పకూల్చింది బుమ్రా స్వదేశంలో మొదటిసారి 5 వికెట్లతో చెలరేగాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇండియా మళ్ళీ శ్రేయాస్ 67 మరియు పంత్ 50 పరుగులతో చెలరేగడంతో 303 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య చేధనతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టిన శ్రీలంకకు ఆరంభంలో శుభారంభం లభించినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని చవి చూసింది. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా కెప్టెన్ కరుణరత్నే మాత్రం సంయమనంతో ఆడుతూ కెరీర్ లో 14 వ సెంచరీని సాధించాడు.
కానీ మిగిలిన వారి నుండి సహకారం లేకపోవడంతో 208 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అశ్విన్ త్రీ మరియు బుమ్రా 4 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. అలా ఇండియా 238 పరుగుల భారీ తేడాతో రెండు టెస్ట్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్ ను గెలవడంతో కీలక పాత్ర పోషించిన ఇండియా వికెట్ కీపర్ మరియు బ్యాట్సమన్ రిషబ్ పంత్ ను మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది.