ఫాన్స్ షాక్.. లేడీ సెహ్వాగ్ జట్టు నుంచి ఔట్?

praveen
మిథాలీ రాజ్ సారథ్యంలోని మహిళల జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతుంది  అన్న విషయం తెలిసిందే. అయితే మహిళా క్రికెట్లో దిగ్గజంగా ఎదిగిన మిథాలీ రాజ్ ఈ ప్రపంచ కప్ మహిళల జట్టుకు అందించిన తర్వాత తాను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ కప్ క్రికెట్ ప్రేక్షకులందరికీ మరింత ప్రత్యేకమైనదిగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా అటు టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ను 107 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది.


 అయితే ఇప్పుడు ప్రపంచ కప్ లో భాగంగా మరో పోరుకు సిద్ధమైంది అన్నది తెలుస్తోంది. మరికాసేపట్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడం గమనార్హం. అయితే భారత మహిళా జట్టులో కీలక బ్యాట్స్మెన్గా లేడీస్ సెహ్వాగ్   గా పేరున్న షాఫలి  వర్మ పై వేటు వేయడం గమనార్హం. ఆమె ప్లేస్ లో మరో యంగ్ ప్లేయర్ కి చోటు దక్కించుకుంది. న్యూజిలాండ్ బంగ్లాదేశ్తో తలపడిన జట్టు తోనే బరిలోకి దిగనుంది. ఇక ప్రస్తుతం స్మృతి మందన  హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్,  ఝాలన్ గోస్వామి లతో టీమిండియా మహిళల జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.


 ఇరు జట్లకు సంబంధించిన తుది జట్టు వివరాలు చూస్తే... టీమిండియా : స్మృతి మంధాన, యష్తికా భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, పూజా వట్సేకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

న్యూజిలాండ్ : సోఫియా డివెన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమీలా కేర్, ఎమీ సథర్ వైట్, మ్యాడీ గ్రీన్, ఫ్రాన్సెస్ మ్యాకే, కేటీ మార్టిన్ ( వికెట్ కీపర్), హేలీ జాన్సెన్, లియా తహిహు, జెస్ కేర్, హన్నా రో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: