కోహ్లీ.. మళ్ళీ కెప్టెన్ అవ్వలేడు : ఆర్సిబి మాజీ సారథి
ఇలాంటి సమయంలోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ తర్వాత బెంగళూరు జట్టుకు కెప్టెన్ అయ్యేది ఎవరు అన్న చర్చ మొదలయింది. విరాట్ కోహ్లీ తర్వాత బెంగళూరు జట్టులో కీలక ఆటగాడు ఎబి డివిలియర్స్ కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అతను పూర్తిగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కొత్త కెప్టెన్ కు సంబంధించిన చర్చ మరింత తీవ్రతరమైంది.
మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ కెప్టెన్లను ప్రకటించాయి. కానీ ఇప్పుడు వరకు అభిమానులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగళూరు జట్టు కెప్టెన్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు. దీంతో విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు అని టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మళ్లీ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం జరగదు.. ఫ్రాంచైజీ క్రికెట్ అయిన అంతర్జాతీయ క్రికెట్ అయినా ఒక సారి తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించినప్పుడు అతడిని వెళ్ళనివ్వడమే కరెక్ట్.. మళ్ళీ వాళ్లకు కెప్టెన్సీ ఇచ్చి అనవసర బాధ్యతలను మోపడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు డేనియల్ వెట్టోరి.