ఐపీఎల్ 2022: CSK కు దీపక్ చాహర్ లేని లోటు పూడ్చేదెవరు... ?

VAMSI
ఐపీఎల్ లో ఎనిమిది టీమ్ లు ఇప్పటి వరకు ఉన్నా ముఖ్యంగా ఎప్పుడూ అభిమానుల మదిలో రెండు పేర్లే వినిపిస్తూ ఉంటాయి, వాటిలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్. బహుశా చెన్నై సూపర్ కింగ్స్ కు అంత పేరు రావడానికి కారణం మహేంద్ర సింగ్ ధోని అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఐపీఎల్ ఆరంభం అయినా నాటి నుండి  నేటి వరకు చెన్నై జట్టుకు సారధిగా ఉంటూ జట్టును ఎంతో విజయవంతముగా ముందుకు నడిపించిన తీరు అద్భుతం. దాదాపు ఐపీఎల్ స్టార్ట్ అయినా రోజు నుండి నేటి వరకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను చెన్నై కి అందించాడు. ఈ ప్రయాణంలో చెన్నై కి నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ను అందించాడు.

2010, 2011, 2018 మరియు 2021 సీజన్ లలో చెన్నై ని విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఐదో టైటిల్ లక్ష్యంగా మార్చి 26 నుండి వేట ప్రారంభించనున్నాడు ధోని. అయితే అంతకన్నా ముందు చెన్నై కి ఒక గట్టి షాక్ తగిలింది. ఫిబ్రవరి లో జరిగిన మెగా వేలంలో దీపక్ చాహర్ ను 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది చెన్నై యాజమాన్యం. అయితే అప్పుడే ఒక బౌలర్ కోసం ఇంత పెట్టడం అవసరమా అని అందరూ పెదవి విరిచారు. కానీ ఇప్పుడు అదే జరిగింది వెస్ట్ ఇండీస్ తో జరిగిన మూడవ టీ 20 మ్యాచ్ లో తొడకండరాల గాయం తో బాధపడిన విషయం తెలిసిందే. ఇందుకోసం చికిత్స జరుగగా దాదాపు 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

దీని ప్రకారం చూస్తే సగానికి పైగా ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. అయితే ఇప్పుడు దీపక్ చాహర్ లేని లోటును స్క్వాడ్ లో ఉన్న ఏబౌలర్ భర్తీ చేయగలడు అన్నది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. దీపక్ చాహర్ బ్యాటింగ్ లో కూడా ప్రతిభ కలిగినవాడని తెలిసిన విషయమే. అలా చూస్తే ప్రస్తుతం చెన్నై జట్టులో ఉన్న శివమ్ దుబే లేదా అండర్ 19 జట్టుకు చెందిన రాజవర్ధన్ హాంగార్గేకర్ లలో ఒకరు ఇతని లేని లోటును పూడ్చగలరు అని అభిమానులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: