విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్... ?

VAMSI
ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో? కెప్టెన్ నుండి తప్పుకున్నాక ఎలా ఉన్నాడో చూస్తే మీకు ఒక విషయం బాగా అర్ధం అవుతుంది. కోహ్లీ కెప్టెన్సీకి ఒక బ్రాండ్ అంబాసిడర్. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు అంటే అవతలి ప్రత్యర్థికి వెన్నులో వణుకు పెట్టాల్సిందే. అయితే ఇపుడు అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి మునుపటి వాడి కోహ్లీ బ్యాట్ నుండి జాలు వారలేదు. ఎప్పటిలా విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్స్ చూడాలని తన అభిమానులు అంత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొన్న ముగిసిన శ్రీలంకతో టీ 20 సిరీస్ కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.

అయితే ఇప్పుడు శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్ ల సిరీస్ కోసం మళ్ళీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. మొదటి టెస్ట్ మొహాలీ వేదికగా మార్చ్ 4 నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. విరాట్ కోహ్లీ కెరీర్ లో ఆడుతున్న 100 వ టెస్ట్ కూడా ఇదే కావడం విశేషం. దీనితో కోహ్లీ అభిమానులు తన నుండి సెంచరీని ఆశిస్తున్నారు. కోహ్లీ కూడా రెండు సంవత్సరాలుగా ఒక్క సెంచరీ కూడా చేసింది లేదు. అయితే ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ కోహ్లీ అభిమానులకు వరంగా మారిందని చెప్పాలి. ఇంతకు ముందు వరకు కరోనా కారణంగా అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించలేదు.

అయితే ఇంతకు ముందు వరకు ప్రేక్షకులను అనుమతించేది లేదని కూడా బీసీసీఐ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఈ టెస్ట్ కు మాత్రం 50 శాతం ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రేపటి నుండి ఈ టెస్ట్ కు సంబంధించి టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. మరి ఈ శుభవార్తతో పాటు కోహ్లీ కూడా ఈ టెస్ట్ లో సెంచరీ సాధించి అభిమానులను అలరిస్తాడో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: