తప్పతాగి న్యూసెన్స్.. మాజీ క్రికెటర్ అరెస్ట్?

praveen
అప్పట్లో దూకుడైన బ్యాటింగ్కు అతడు మారుపేరు.. ప్రతి బ్యాటింగ్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వాడు ఈ ఆటగాడు. అతను ఎవరో కాదు భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ. ఇప్పుడు కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ గొప్ప విషయం లో కాదు ఒక చెత్త విషయంలో.  ఎంతో బాధ్యతాయుతమైన పౌరుడిగా మెలగాల్సిన వినోద్ కంబ్లీ ఇటీవలే తప్పతాగి కార్ డ్రైవ్ చేస్తూ ఒక రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యాడు. తన రెసిడెన్షియల్ లో ఉంటున్న మరో వాహనాన్ని ఢీ కొట్టాడు.


 అంతటితో ఆగకుండా ఇక అక్కడ ఉన్న సొసైటీ సెక్యూరిటీ గార్డు తో కూడా మద్యం మత్తులో వాగ్వాదానికి దిగాడు వినోద్.  దీంతో ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీనీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి బెయిల్పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత వినోద్ కాంబ్లీ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు అన్నది తెలిసిందే.ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాడు వినోద్ కాంబ్లీ.


 గతంలో వినోద్ కాంబ్లీ ఒక సైబర్ నేరానికి గురయ్యాను అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సైబర్ ఎటాక్  కారణంగా తన ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు మాయమయ్యాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్ కాంబ్లీ. ఇక కొన్నాళ్లపాటు ఇలా మాజీ క్రికెటర్ కు సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.  ఇక ఇప్పుడు ఏకంగా తప్పతాగి న్యూసెన్స్ చేస్తూ వినోద్ కాంబ్లీ పోలీసులకు పట్టుబడటం పై మాత్రం అటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: