బాలయ్యగా మారిన హిట్ మ్యాన్.. రోహిత్ ఫోటో వైరల్?
ఇది కొన్ని కొన్ని సార్లు డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్ లు అయితే స్వయంగా అతనే హీరోల ఫేస్ మార్పింగ్ చేసి తన పేస్ పెట్టుకుని వీడియోలు ఫొటోలను క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టాలీవుడ్ లో నటసింహం గా కొనసాగుతున్న స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ #NBK107 సినిమా ప్రస్తుతం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ బాలయ్య అభిమానులు అందర్నీ కూడా ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి.
అయితే ఇటీవలే నందమూరి బాలకృష్ణ లుక్ లో టీమిండియా కెప్టెన్ హిట్ మాన్ కనిపిస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలయ్య గెటప్ కు రోహిత్ శర్మ మొఖం యాడ్ చేసి మార్ఫింగ్ చేసింది. ఇక దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అంతే కాదు దీనికి ఒక కామెంట్ కూడా జత చేసింది. హిట్టు కొట్టాలంటే బాలయ్య సిక్స్ కొట్టాలంటే హిట్ మ్యానే భయ్యా అంటూ ఒక కామెంట్ జత చేయడంతో ప్రస్తుతం ఒక వైపు ఆ బాలయ్య అభిమానులు మరోవైపు రోహిత్ శర్మ అభిమానులు కూడా ఈ ఫోటో చూసి తెగ మురిసిపోతున్నారు.