ఐపీఎల్ : అతనికి ఆరు కోట్లు దండగ.. ఇప్పుడు వైస్ కెప్టెన్సీనా?
గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. ఆ తర్వాత తుది జట్టులో చోటు ఇవ్వకుండా పక్కన పెట్టేయడం.. ఇక అటు వెంటనే డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాడిని మెగా వేలంలోకి వదిలేయడం.. ఇక ఈ నిర్ణయాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయ్. ఇక ఇటీవలే మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నికోలస్ పూరన్ ను పోటీపడి మరీ పది కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది సన్రైజర్స్.
ఇక ఎలాంటి అనుభవం లేని ఆన్ క్యాప్డ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కు ఆరు కోట్లు చెల్లించడం మాత్రం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక ఇప్పుడు మరో సారి సన్రైజర్స్ యాజమాన్య తీసుకున్న నిర్ణయం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం సన్రైజర్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు కేన్ విలియమ్సన్. అయితే వైస్ కెప్టెన్గా ఆల్ రౌండర్ అభిషేక్ శర్మను నియమించే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికి 6 కోట్లు పెట్టి కొనుగోలు చేయడమే దండగ అంటే ఇక వైస్ కెప్టెన్సీ అప్పగించడం కూడానా అంటూ ఇక సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం పై గరం గరం అవుతున్నారు.