అటు ఇండియాకు.. ఇటు ధోనికి షాక్.. ఎందుకంటే?
ఇక వన్డే టి20 సిరీస్ లలో కూడా వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. కాగా మరికొన్ని రోజుల్లో అటు శ్రీలంక తో వరుసగా సిరీస్ లు ఆడబోతుంది. ముందుగా టి20 సిరీస్ ఆడబోతుంది.. ఇటీవల వెస్టిండీస్ టి20 గెలిచిన జోరులో ఉంది. అటు శ్రీలంకతో కూడా అదే జోరును కొనసాగిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ శ్రీలంక టి20 సిరీస కి ముందు టీమిండియా కు భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా లో స్టార్ పేపర్ గా కొనసాగుతున్న దీపక్ చాహర్ గాయం కారణంగా శ్రీలంక టి20 సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వెస్టిండీస్తో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో మోకాలి గాయంతో చాహర్ ఎంతగానో బాధ పడ్డాడు. అయితే 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన దీపక్ చాహర్ గాయం వేధించడంతో చివరికి మైదానాన్ని వీడాడు. ఎంతో కీలకంగా వ్యవహరించిన దీపక్ చాహర్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే దీపక్ చాహర్ గాయం తీవ్రంగా ఉండడంతో అతని గాయం నుంచి కోలుకోవడానికి పూర్తిగా ఆరు వారాల పాటు సమయం పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం దీపక్ చాహర్ శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో కూడా కొన్ని మ్యాచులకూ దూరం కావాల్సి వస్తోంది. ఇకపోతే ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే.