భలే రికార్డు.. రోహిత్ ను వెనక్కి నెట్టిన కోహ్లీ?
అయితే మొన్నటి వరకు టీమిండియాలో 3 ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగగా కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడు రోహిత్ శర్మ. కానీ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు రోహిత్ శర్మ. రోహిత్ కెప్టెన్సీలో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా భారత జట్టులో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక వీరిద్దరూ ఎంతో సమన్వయంతో జట్టును ముందుకు నడిపిస్తున్నారు అన్నది తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కోహ్లీ చేసిన హాఫ్ సెంచరీ తో రోహిత్ శర్మ వెనక్కి నెట్టేశాడు. రోహిత్ శర్మ 121 మ్యాచుల్లో 30 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 97 మ్యాచ్ లోనే ఈ ఘనతను సాధించడం గమనార్హం. అదే సమయంలో ఇటీవలే రెండో టీ20 మ్యాచ్‌లో గెలుపుతో భారత జట్టు టి-20 లలో 100వ విజయాన్ని సాధించిన రెండవ దేశంగా రికార్డు సృష్టించింది. పాకిస్తాన్ 189 మ్యాచ్‌లో 118 విజయం సాధించగా.. భారత్ 155 మ్యాచ్ లలో 100 విజయాలు సాధించింది.