ఐపీఎల్ వేలం : పాక్ క్రికెటర్ కి 200 కోట్లు?
ఏంటి షాక్ అవుతున్నారు కదా.. పాకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేవు.. అసలు ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగవు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్లో జరుగుతూ ఉంటాయి. ఐపీఎల్లో అయితే పాక్ క్రికెటర్లను అసలు అనుమతి లేదు. ఇదే విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హడావిడి కూడా చేస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు కదా అలాంటిది పాకిస్తాన్ క్రికెటర్ కి ఐపీఎల్ మెగా వేలంలో 200 కోట్లు పలకడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్లో తమకు ప్రవేశం లేదన్న కారణంతో అప్పుడప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు.. ఆ దేశ మీడియా సైతం తమ అక్కసును వెళ్లగక్కుతూ ఉంటుంది.
ఐపీఎల్ మెగా వేలం ముగిసిన నేపథ్యంలో ఒక పాక్ జర్నలిస్టు తమ దేశ క్రికెట్ ను ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది. నెట్టింట్లో రచ్చ చేస్తుంది. అతను ఏమని ట్వీట్ చేశాడు అంటే.. పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్నట్టయితే రెండు వందల కోట్లకు అమ్ముడు పోయే వాడు అంటూ కాస్త అత్యుత్సాహంతో ట్విట్ చేశాడు. ఇతిషమ్ ఉల్ హక్ అనే పాక్ జర్నలిస్ట్. ఈ ట్విట్ చుసిన భారత క్రికెట్ ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. ఒక్క జట్టుకు ఖర్చు చేసేది 90 కోట్లు అయితే ఇక మీ పాకి బౌలర్ కి 2 వందల కోట్లు ఎక్కడినుంచి తెచ్చి పెడతారబ్బా.. ఈ విషయం ఆలోచించలేదా ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ రుణమాఫీ కోసం ఇమ్రాన్ ఖాన్ షాహీన్ అఫ్రిది ని ఉపయోగించాలని అనుకుంటున్నాడా ఏంటి అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు..