మహిళా కమిషన్ను ఆశ్రయించిన కోడలు.. చివరికి?

praveen
అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు ఊహించని విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే ఎంతో మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ బారిన పడిన ఎంతోమంది ఊహించని విధంగా మృత్యుఒడిలోకి చేరడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయ్. ఇక్కడ ఓ మహిళకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది. భర్త పిల్లలతో జీవితం సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ పంజా విసిరింది.

 ఈ క్రమంలోనే ఇంటి పెద్దగా కొనసాగుతున్న భర్తను వారికి దూరం చేసింది. అయితే భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆ మహిళకు అత్తింటివారి నుంచి ఆదరణ కరువైంది. చివరికి భర్త చనిపోవడంతో ఆ మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇక అటు అత్తింటి వారి నుంచి వేధింపులు కూడా ఎక్కువ అవుతూ ఉండడంతో ఇటీవలే మహిళా కమిషన్ను ఆశ్రయించింది ఆ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండలంలో జరిగింది. జాహ్నవికి 2020 లో వివాహం జరిగింది.

 కానీ పెళ్లయిన కొన్నాళ్లకే కోవిడ్ పంజా విసరడం తో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇక అప్పటినుంచి జాహ్నవి పోషణ విషయం లో అత్తింటి వేధింపులు ఎదుర్కొంటూ వస్తుంది. చివరికి ఆర్థిక సమస్యలు  చుట్టు ముట్టాయి. ఇప్పుడు అత్తింటి వేధింపులు  మరింత ఎక్కువయ్యాయి. దీంతో మహిళా కమిషన్ను ఆశ్రయించింది జాహ్నవి. ఈ కేసును మహిళా కమిషన్ సభ్యురాలు కజల వెంకటలక్ష్మి విచారణ జరపగా.. ఒక చట్టపరమైన హక్కుల తో జాహ్నవికి జరగాల్సిన న్యాయం పై అత్తింటి వారిని ఒప్పించారు మహిళ కమిషన్ సభ్యులు. ఈ క్రమంలోనే అత్తింటివారి నుంచి జాహ్నవి జీవన భృతి సంబంధించి రావాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో జాహ్నవికి అందజేశారు. దీంతో వివాహిత సంతోషం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: