బీసీసీఐ క్లారిటీ.. కొత్త షెడ్యూల్ ఇదే?
అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉండగా ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనతో బీసీసీఐ షెడ్యూల్ లో పలు మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తర్వాత జరగాల్సిన టి20 సిరీస్ ని ముందు నిర్వహించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ క్రమంలోనే షెడ్యూల్ సంహరించడంతో ఇక ఇప్పుడు ముందు టి20 మ్యాచ్ లు జరగబోతున్నాయ్. అనంతరం ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచులు జరగబోతున్నాయి. ఇక ఇటీవల ఈ విషయాన్ని బిసిసీఐ అధికారిక సోషల్ మీడియాలో ఖాతాలో వెల్లడించింది.
బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న రెండో టీ20, 27న మూడో టీ20 మ్యాచ్ లు జరగబోతున్నాయి . తొలి టీ20 లక్నో వేదికగా, మిగతా రెండు మ్యాచ్‌లు ధర్మశాల వేదికలను ఫిక్స్ చేశారు. ఇక ఆ తర్వాత తొలి టెస్ట్ మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు జరుగుతుంది. రెండో టెస్ట్ బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు జరుగుతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. కాగా బుధవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్ ముగియగానే శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.