RCB కొత్త కెప్టెన్ గా.. అతనైతే బాగుంటుంది?

frame RCB కొత్త కెప్టెన్ గా.. అతనైతే బాగుంటుంది?

praveen
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ ఆత్రుతగా ఎదురు చూసిన ఐపీఎల్ వేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ప్రతి ఫ్రాంచైజీ  కూడా తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక కొంత మంది ఆటగాళ్లు రికార్డు స్థాయిలో ధర పలికితే.. మరికొంతమంది అతి తక్కువ ధరకే అమ్ముడుపోయారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఉన్న కొన్ని జట్లకు కెప్టెన్లు కూడా మారే అవకాశం ఉంది. గత సీజన్ వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ సీజన్లో మాత్రం కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.


 ఎందుకంటే అటు అంతర్జాతీయ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించిన విరాట్ కోహ్లీ ..  ఐపీఎల్లో బెంగళూరు జట్టు కెప్టెన్గా కూడా తప్పుకుంటాను అంటూ ప్రకటించడం అందరినీ షాక్కు గురి చేసింది. విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కొత్త కెప్టెన్ ఎవరు  అన్న చర్చ మొదలయింది. కోహ్లీ తర్వాత ఎబి డివిలియర్స్ కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. కానీ అతను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నా అంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఈ కొత్త కెప్టెన్ కు  సంబంధించిన చర్చ మరింత తీవ్రం అయింది.


 అయితే ఇటీవలే మెగా వేలంలో సీనియర్ ప్లేయర్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ యాప్ డూప్లెసిస్ ని సొంతం చేసుకుంది బెంగళూరు జట్టు. ఇక అతనే కెప్టెన్ అవబోతున్నాడు అంటూ టాక్ వినిపించింది. ఇలాంటి సమయంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కొత్త పేరును తెరపైకి తీసుకువచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ  ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ కు కెప్టెన్సీ అప్పగించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు సునీల్ గవస్కర్. ఇక అదే సమయంలో దినేష్ కార్తీక్ కెప్టెన్ అవ్వాలని మరికొంత మంది కోరుకుంటున్నారు. అటు బెంగళూరు ఫ్రాంచైజీ  కెప్టెన్సి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: