మెగా వేలంలో అపశృతి.. ఇలా జరిగిందేంటి?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది  ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్లబోతు నాడా అని ఎంతో ఉత్కంఠగా  చూస్తున్నారు ప్రేక్షకులు. బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మెగా వేలంలో ఎంతో ప్రతిభ గల ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు ఫ్రాంచైజీలు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్న ఆటగాళ్ల కోసం  వేలంలో పోటీ పడుతూ ఉండటం గమనార్హం.

 ఇలా బెంగుళూరు వేదికగా అన్ని జట్లకు సంబంధించిన ప్రాంఛైజీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ మెగా వేలం ఎంతో ఉత్కంఠ భరితంగా హోరాహోరీగా జరుగుతున్న సమయంలో ఊహించని విధంగా అపశృతి చోటు చేసుకుంది   ఏకంగా మెగా వేలం నిర్వాహకుడు ఒక్కసారిగా స్టేజ్ మీద గొప్ప కూలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో వెంటనే మెగా వేలం నిలిపివేశారు. ఇక ఐపీఎల్ లో ఇలా అపశ్రుతి చోటు చేసుకోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఐపీఎల్ నిర్వాహకుడు అయిన హ్యూఎడ్ మెడిస్ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ  ఉన్న వారందరూ కూడా కాసేపటి వరకూ ఏమీ అర్థం కాలేదు. వెంటనే షాక్ నుంచి తేరుకున్న అందరూ సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఘటన తో ఒక్కసారిగా మెగా వేలం నిలిపివేశారు.కాగా ఇప్పటివరకు టాప్లో ఉన్న ఆటగాళ్లకు సంబంధించిన మెగా వేలం జరగ్గా.. ఎంతో మంది ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు వివిధ ఫ్రాంచైజీ ల  మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. కాగా ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు శ్రేయస్ అయ్యర్. కోల్కత్తా నైట్ రైడర్స్ 12.25 కోట్లకు అతని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: