ఐపీఎల్ మెగా వేలం: కోట్లు కొల్లగొట్టేది ఎవరు ?

VAMSI
ఎన్నో రోజులుగా క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపిఎల్ సీజన్ 15 కు ప్లేయర్స్ ను కొనుగోలు చేసే మెగా వేలం స్టార్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఐపిఎల్ లో ఆడి తమ సత్తా ఏమిటో నిరూపించుకుంటే వారి కెరీర్ మారిపోయినట్లే. ఐపిఎల్ చరిత్రలో ఎందరో ఆటగాళ్ళు తమదైన ఆటతో రెచ్చిపోయి ఆ తర్వాత తమ క్రికెట్ కెరీర్ లో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెటర్లు ఐపిఎల్ లో ఒక్కసారైనా ఆడాలని  అదే తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటారు. అలాంటి వారి జీవితాలు మారిపోయే రోజు రానే వచ్చింది.

ఈ రోజు మరియు రేపు బెంగళూర్ లో ఐపిఎల్ సీజన్ 15 కు మెగా వేలం జరగనుంది. అయితే ఇప్పుడు ఈ వేలంపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి మంచి ఆటగాళ్లు కూడా వేలంలో కొనుగోలు కారు. అదే విధంగా ఒక అన్ క్యాప్ ప్లేయర్ సైతం భారీ ధరకు అమ్ముడు అయిన సందర్భాలు ఉన్నాయి.. అందుకే ఇటువంటి విచిత్రాలు ఏమేమి చోటు చేసుకుంటాయి అని ప్రతి నిముషం గమనిస్తూనే ఉంటారు.

ఇప్పటికే ఏయే ప్రాంఛైజీలు ఎవరిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నాయి అన్న విషయంపైనా వారికి ఒక క్లారిటీ ఉంది. అయితే వారు అనుకున్న విధంగా అనుకున్న వారిని దక్కించుకోగలరా అన్నది ఇక్కడ ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి ఆటగాడి కోసం ప్రతి ఒక్క ఫ్రాంచైజీ పోరాడుతుంది. ఇలా ఎన్నెన్నో సస్పెన్స్ లు ఈ వేలంలో జరగనున్నాయి. అయితే గత కొద్దీ రోజులుగా వినబడుతున్న సమాచారం ప్రకారం ఈ సారి సీనియర్ ఆటగాళ్లకు ఉద్వాసన తప్పదట. అందరూ కూడా యువ ఆటగాళ్లపైనే దృష్టిని సారిస్తున్నారు. మరి ఎవరు కోట్లు కొల్లగొడుతారో? అలాగే అమ్ముడు పోకుండా ఎవరు మిగిలి పోతారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: