CSK లో అసలు ధోని ఎలా ఎంపికయ్యాడో తెలుసా?
అయితే ప్రస్తుతం ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఐపీఎల్ ప్రారంభ ఈ సమయంలో వేలంలో ధోని నీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఎలా కొనుగోలు చేసింది అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే 2007 టీ20 ప్రపంచ కప్లో టీమ్ ఇండియా కు విజేతగా నిలబెట్టాడు మహేంద్రసింగ్ ధోని. తరువాత సంవత్సరమే ఐపీఎల్ కు సంబంధించిన వేలం జరిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టు ధోనిని దక్కించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపాయట.
చివరికి ముంబై ఇండియన్స్ జట్టు సచిన్ టెండూల్కర్ సొంతం చేసుకోగా.. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాటీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తీసుకుంది. ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ అతడిని తీసుకున్న సమయంలో కనీస ధర 4లక్షల డాలర్లు అయితే 1.5 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుందట. కాగా తొలి సీజన్లో షేన్వార్న్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజస్థాన్ జట్టును విజేతగా నిలబెట్టారు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించి ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై ని దిగ్గజ జట్టుగా గా మార్చేశాడు. ఈ విషయాన్ని రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన మాజీ యాక్షనీర్ రిచార్డ్స్ చెప్పుకొచ్చాడు.