నేటి మ్యాచ్ నుండి ఇషాన్ కిషన్ అవుట్... కారణం ఇదే?

VAMSI

సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఎదురైన చేదు అనుభవం తర్వాత ఇండియా ఆడుతున్న సీరీస్ కావడంతో అందరి దృష్టి టీమ్ ఇండియా మీదనే నెలకొంది. ఫిబ్రవరి 6 నుండి వెస్ట్ ఇండీస్ తో మూడు వన్ డే ల సీరీస్ ప్రారంభం అయింది. అహ్మదాబాద్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో ఫామ్ లో ఉన్న వెస్ట్ ఇండీస్ ను భారత్ తమ స్పిన్ మాయలో చిక్కుకునేలా చేసింది. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ కేవలం 176 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి ఇండియా ఆ స్కోర్ ను చేధించింది. ఈ మ్యాచ్ లో పునరాగమనం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం శుభపరిణామం.
అయితే రెండవ మ్యాచ్ కు జట్టులో ఒక కీలకమైన మార్పు చేసే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కు ముందు కొందరు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో వారి స్థానాలను భర్తీ చేయడానికి ఇషాన్ కిషన్, షారుఖ్ ఖాన్ లకు పిలుపు అందింది. దానికి తోడు వ్యక్తిగత కారణంతో కెఎల్ రాహుల్ మొదటి వన్ డే కు దూరమవడంతో రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఇషాన్ కిషన్ కి వచ్చింది. అయితే ఇషాన్ కిషన్ ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకోవడంలో విఫలం అయ్యాడు. మ్యాచ్ ఇండియా చేతుల్లో ఉందని తెలిసినా స్వేచ్ఛగా బ్యాట్ జులిపించలేకపోయాడు. ఇషాన్ కిషన్ 36 బంతులు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేసి అకీల్ హుస్సేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
అందుకోసం రెండవ మ్యాచ్ లో బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఒకవేళ ఇషాన్ కనీసం అర్ధ సెంచరీ అయినా చేసుంటే రెండవ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండేది. అంతే కాకుండా ఈ మ్యాచ్ కు రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. కానీ ఇది ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు తెలిసింది. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారో అన్నది తెలియాలంటే టాస్ వరకు వేచి చూడాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: