ఆదిపత్యం కోసం ఒకరు.. సమం చేసేందుకు మరొకరు?
ఈ క్రమంలోనే అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది టీమిండియా. రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అదే సమయంలో మొదటి మ్యాచ్లో ఓడిపోయి నిరాశతో ఉన్న వెస్టిండీస్ జట్టు ఇక రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని నిర్ణయించుకుంది. కాగా నేడు రెండవ వన్డే మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించాలి అంటే విరాట్ కోహ్లీ రాణి చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు.
ఇటీవలే మొదటి ఇన్నింగ్స్ లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఇక రెండో వన్డే మ్యాచ్లో మాత్రం మునుపటి ఫామ్ అందుకుంటాడు అని అభిమానులు అనుకుంటున్నారు. అదే సమయంలో ఇక రెండో వన్డే మ్యాచ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి భారత జట్టు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. కాగా గత కొన్నేళ్ల నుంచి వెస్టిండీస్ జట్టు నిలకడగా రాణించలేక పోతోంది. ఇక ఇది టీమిండియాకు ఎంతగానో కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇకపోతే కెప్టెన్ రోహిత్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు అన్నది చూడాలి.