ప్రపంచ కప్ టీమ్ ఇండియాదే?
ఇక ఫైనల్ పోరులో గెలిచి అండర్-19 ప్రపంచ కప్ అందుకునేందుకు సిద్ధమవుతోంది. రేపు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది టీమిండియా కుర్రాళ్ల జట్టు. ఇది ఫైనల్ మ్యాచ్ పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయం చేస్తున్నారు. ఇక తాజాగా అండర్-19 జట్టు కెప్టెన్ యష్ దుల్ తండ్రి విజయ్ స్పందిస్తూ అండర్-19 ప్రపంచకప్ భారత్ దే అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ ఖచ్చితంగా గెలిచి తీరుతాము అంటూ చెప్పుకొచ్చాడు. యష్ దుల్ క్రికెట్ ఫీల్డ్ లో చాలా చురుకుగా ఉంటాడు. భారత ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషిస్తాడు అంటూ అతని తండ్రి చెప్పుకొచ్చాడు. భారత్ మొత్తం టీమిండియా వెనక ఉంది ఇక అందరి మద్దతుతో టీమిండియా విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు కెప్టెన్ యష్ దుల్ తండ్రి విజయ్.
కాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఫైనల్లో కూడా సత్తా చాటాలని అందరూ కోరుకుంటూ ఉండగా ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.