కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ ఇటీవలే ప్రమోషన్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల ఫార్మాట్కు కోహ్లీ తర్వాత కెప్టెన్గా రోహిత్ శర్మ  కెప్టెన్ గా ఎంపిక అవ్వగా ఇక వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు.. అంటే టీమిండియాలో ఎన్నో రోజుల నుంచి వైస్ కెప్టెన్ గా ఉన్న వారిని ఇక ఆ తర్వాత కెప్టెన్ గా నియమించడం లాంటివి జరుగుతూ ఉంది. ఇలా కేఎల్ రాహుల్  ఫ్యూచర్ కెప్టెన్ అని బీసీసీఐ వైస్ కెప్టెన్సీ ఇచ్చి చెప్పకనే చెప్పింది. అయితే కెప్టెన్ గా మాత్రం కేఎల్ రాహుల్ కు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ నిరాశ ఎదురైంది అని చెప్పాలి..


 సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ గైర్హాజరు తో  టెస్టుల్లో కూడా వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్లో కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ఇక భారత జట్టును ముందుకు నడిపించాడు. కానీ ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఇక ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడాల్సి ఉండగా రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఇక తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. కానీ వన్డే సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి చెత్త రికార్డు నమోదు చేసింది టీమిండియా. దీంతో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.


 కేఎల్ రాహుల్  కెప్టెన్సీకి పనికిరాడు అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందిస్తూ కేఎల్ రాహుల్ కు మద్దతుగా నిలిచాడు. కేఎల్ రాహుల్ బ్యాట్స్మెన్గా కెప్టెన్గా మంచి భవిష్యత్తు ఉందని గంభీర్ వ్యాఖ్యానించాడు. అతడు ఎంతో ప్రశాంతంగా ఆట పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతం గంభీర్. కేవలం నాలుగు మ్యాచ్ల ఆధారంగానే తన కెప్టెన్సీని తప్పుబట్టడం సరైంది కాదు అంటూ వ్యాఖ్యానించాడు. గెలుపు వస్తే పొంగిపోవడం ఓటమి కుంగిపోవడం కె.ఎల్.రాహుల్ కు తెలియదు అంటూ మద్దతుగా నిలిచాడు గౌతం గంభీర్. కాగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టుకు కెప్టెన్గా కేఎల్ రాహుల్  ఎంపిక కాగా మెంటార్ గా కొనసాగుతున్నాడు గౌతం గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: