ఫ్రాంచైజీ తో గొడవ.. కెప్టెన్సీ పోయింది?
ఇది కాస్త సంచలనం గానే మారిపోయింది చెప్పాలి. కాగా ఈ ఘటనపై స్పందించిన మెహదీ హసన్ మీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లితో ఉండడానికి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడానికి జట్టు సీఈవో యాసిర్ ఆలం కారణం అంటూ అసలు విషయం చెప్పేశాడు మెహదీ హసన్ మిరాజ్. ఇక జట్టు ప్రధాన కోచ్ నిక్సన్ సలహా మేరకే కెప్టెన్సీ నుంచి తప్పించాము అంటూ గతంలో సీఈవో యాసిర్ చెప్పిన సంగతి తెలిసిందే.
సరిగ్గా మ్యాచ్ ఆడటానికి మూడు గంటల ముందు ఇకపైన కెప్టెన్ నువ్ కావు అంటూ నాకు చెప్పారు. కెప్టెన్సి నుంచి తప్పించడం కంటే ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అన్నదే బాధ కలిగించింది. ఆటగాడిగా నాకు ఇది ఎంతో అవమానకరం. అయితే నన్ను కెప్టెన్గా తొలగిస్తున్నట్లు కోచ్ పై సీఈవో యాసిర్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్దం. నేను కోచ్ తో అరగంట సేపు మాట్లాడాను. యాసిర్ పూర్తిగా అపరాధి. కానీ మా జట్టు ఓనర్ మాత్రం ఎంతో మంచివాడు. ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోడు. జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చుకోవడం వల్ల ఈ గొడవంతా మొదలైంది. యాసిర్ లేకపోతేనే నేను మళ్ళీ ఈ జట్టులోకి వస్తాను అంటూ తేల్చి చెప్పాడు మెహదీ హసన్ మీరాజ్.