అవును.. కోహ్లీ సెంచరీ చేయలేదు.. అయితే ఏమైంది?

praveen
2019 నవంబర్ 22.. హలో గురూ ఈ డేట్ ఏంటి అని అనుకుంటున్నారా.. సరిగ్గా ఈ రోజే విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఇండియాలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తన అభిమానులందరినీ కూడా గర్వపడేలా చేశాడు. ఇక బ్యాట్మెన్గా తనకు తిరుగు లేదు అని నిరూపించాడు.. ఒక రకంగా టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. కోల్కతాలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇదే రోజు కోహ్లీ  70వ సెంచరీ నమోదు చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం క్రమక్రమంగా సెంచరీకి మైలు దూరం వచ్చేశాడు కోహ్లీ. సెంచరీ చేసి రెండేళ్లు అవుతోంది. సెంచరీ అయితే చేయలేకపోయాడు కనీసం ఎక్కువ పరుగులు అయినా చేయాలి కదా అది కూడా చేయడానికి ఇబ్బంది పడిపోతున్నాడు విరాట్ కోహ్లి.


 ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ ఫాం విషయంలో ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తర్వాత కాలంలో ఏకంగా కొన్ని కారణాలవల్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు  అయితే విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో భారీగా పరుగులు చేయకపోవడం పై  మాత్రం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పుడు ఇదే విషయంపై టీం ఇండియా పేస్ బౌలర్  మహమ్మద్ షమీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సెంచరీ చేయకపోతే ఏమవుతుంది అంటూ ప్రశ్నించి కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లీ సెంచరీ చేస్తేనే పెద్ద ఆటగాడు అని అనుకోలేమని.. ఈ మధ్య కాలంలో కోహ్లీ ఎంతో నిలకడగానే ఆడుతున్నాడు అంటూ షమి వ్యాఖ్యానించాడు.


 సెంచరీ చేయకపోతే ఏంటి కొన్ని హాఫ్ సెంచరీలు చేసాడు కదా అది గుర్తుంచుకోండి అంటూ మహమ్మద్ షమీ వ్యాఖ్యానించాడు. హాఫ్ సెంచరీ ఆపైన చేసే పరుగులు కూడా జట్టుకు పటిష్టమైన స్థితిలో ఉండేలా చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి అంటూ మహమ్మద్ షమీ వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లీ సారథ్యంలోనే జస్ప్రిత్ బూమ్రా తో పాటు షమి కూడా భారత క్రికెట్ లో కీలకమైన బౌలర్లు గా ఎదిగారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ శక్తి ఎంతో గొప్పదని ఆది జట్టులోని మిగతా సభ్యులకు కూడా వస్తుంది అంటూ వ్యాఖ్యానించాడ షమి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బౌలర్లకు ఎప్పుడు స్వేచ్ఛ ఇచ్చేవాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇలా మహమ్మద్ షమీ మనసులో ఉన్న మాటను బయట పెట్టి కోహ్లీకి మద్దతు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: