ఇండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు?

praveen
మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే స్వదేశం లో వెస్టిండీస్  జట్టుతో వన్డే టి20 సిరీస్  ఆడబోతుంది టీమ్ ఇండియా. వెస్టిండీస్ జట్టును సొంత గడ్డపై చిత్తు చేయాలని పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది టీమిండియా. ఇక ఫిబ్రవరి 6వ తేదీ నుంచి భారత్ వెస్టిండీస్ మధ్య పోరు ప్రారంభం కాబోతుంది. మొదట భారత్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ జరగ బోతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టును అధికారికం గా ప్రకటించిన విషయం తెలిసిందే.



 అదే టీం ఇండియా  తో సిరీస్ కు ముందు ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు లో గొడవలు జరుగుతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ప్రస్తుతం వన్డే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న కిరణ్ పోలార్డ్ తో జట్టులో ఉన్న ఆటగాడికి కొన్ని వివాదాలు తలెత్తాయని.. ఆల్ రౌండర్ ఓడెన్స్ విత్ విషయం లో కీరన్ పొలార్డ్ వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలే ఇదే విషయంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా స్పందించింది.


 టీం ఇండియా  తో సిరీస్ ఆడటానికి ముందు వెస్టిండీస్ జట్టులో విభేదాలు తలెత్తాయని చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ స్పష్టం చేస్తోంది. వెస్టిండీస్ జట్టులో ఎటువంటి విభేదాలు లేవని ఆటగాళ్లు అందరూ కూడా బాగున్నారని స్పష్టం చేసింది. తమ కెప్టెన్ కిరణ్ పోలార్డ్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఇలాంటి రూమర్స్ సృష్టించారని ఆ దేశ క్రికెట్ బోర్డు చెప్పుకొచ్చింది. ఇకపోతే అటు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ ఆడుతుంది వెస్టిండీస్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: