వావ్.. సిఎస్కే ఆటగాడికి కెప్టెన్సీ దక్కింది?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో ఇలాంటి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టి20 ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ఇయాన్ మోర్గాన్. ఇకపోతే ఇటీవలె గాయం కారణంగా ఇయాన్ మోర్గాన్ మిగతా టి 20 ల నుంచి తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. తొడ కండరాలు అసాధారణంగా ఇయాన్ మోర్గాన్ మిగితా సిరీస్ కు దూరం కాబోతున్నాడు అంటూ తెలిపింది. అయితే ఇక రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో ఆ తర్వాత ఎవరు జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరించపోతున్నారూ అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దూరం కావడంతో చివరికి అటు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మోయిన్ అలీ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2 - 1 తేడాతో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది వెస్టిండీస్ జట్టు. అయితే ఇక టి20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది అని చెప్పాలి. ఆ తర్వాత రెండవ టి20 మ్యాచ్ లో కాస్త కుదుర్చుకున్నట్లు కనిపించినప్పటికీ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఇక చివరి వరకు కూడా రెండవ టీ 20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగానే సాగింది.

 రెండవ టి20 మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు మూడో మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తోంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి మూడో టి20 మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే 3 టి20 మ్యాచ్ లలో కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు అనే చెప్పాలి. మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా  మోయిన్ అలీ సెలెక్ట్ కావడంతో అతని కెప్టెన్సీలో జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.  కాగా మోయిన్ అలీ ఐపిఎల్ లో చెన్నై జట్టులో ఉన్నాడు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: