కెప్టెన్సీ రేసులోకి కొత్త పేరు.. అతనికి కూడా ఆశ పుట్టిందే?

praveen
దక్షిణాఫ్రికా టూర్ లో టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పి విరాట్ కోహ్లీ అందరికీ షాకిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అటు బీసీసీఐకి కొత్త తలనొప్పి మొదలైంది. కోహ్లీ తర్వాత టెస్ట్ కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేదానిపై గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ముందుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్కు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ  కూడా చేపట్టబోతున్నాడు అని అందరూ అనుకున్నారు.


  పరిమిత ఓవర్ల ఫార్మట్, టెస్ట్ లకుకు వేర్వేరు కెప్టెన్ వుంటే బాగుంటుంది అని మీ అభిప్రాయం వ్యక్తం చేసింది బీసీసీఐ. అదే సమయంలో ఫిట్ నెస్, వయసు దృశ్య రోహిత్ శర్మను కాకుండా యువ ఆటగాడికి కెప్టెన్సీ ఇస్తే   బాగుంటుందని మాజీ ఆటగాళ్లు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ లాంటి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇక మొన్నటికి మొన్న తనకు కెప్టెన్సీ ఇస్తే జట్టును ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ టీమిండియా పేసర్ జస్ప్రిత్ బూమ్రా కూడా మనసులో ఉన్న మాట బయటపెట్టాడు. ఇలా ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్సీ గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో మరో పేరు ఈ రేసులోకి వచ్చేసింది.


 మరో ఆటగాడికి కెప్టెన్సీపై ఆశ పుట్టింది. ప్రస్తుతం టీమిండియా లో రెగ్యులర్ బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ షమి తనకు కెప్టెన్సీ అవకాశం వస్తే జట్టును  ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇటీవలే మనసులో మాట బయట పెట్టేసాడు. మొత్తానికి తన దృష్టి మొత్తం మెరుగ్గా రాణించడంతో పైనే ఉందని తర్వాత మాట దాటవేసే ప్రయత్నం కూడా చేశాడు మహ్మద్ షమి.. కాగా ఇప్పటికే టెస్టుల్లో 209 వికెట్లు, వన్డే లో 148 వికెట్లు, టి20 లో 18 వికెట్లు పడగొట్టి విజయవంతమైన బౌలర్ గా కొనసాగుతున్నాడు. మరి మహమ్మద్ షమి మనసులో మాట బయట పెట్టాడు ఇక ఇప్పుడు సెలెక్టర్లు ఏం చేస్తారన్నదిహాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: