
ఐపీఎల్ లోకి పఠాన్ రీ ఎంట్రీ..!
ఇండియాలో క్రికెటర్లకు కొదవ లేదు. అందువల్ల జాతీయ జట్టులో చోటు దక్కని చాలా మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతూ... ఉంటారు. అలాగే జాతీయ జట్టుకు ఎక్కువ కలం సేవలందించిన సీనియర్ ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐపీఎల్ లో చెలరేగుతుంటారు. ఇలా ఐపీఎల్ లో కొంత కలం ఆడిన తర్వాత... చాలా మంది ఇందులో నుండి కూడా తప్పుకుంటే... మరికొంత మంది ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చావు. ఇదే లిస్ట్ లోకి టీమిండియా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ వస్తాడు. ఐపీఎల్ లో మొదటి 10 సీజన్ లలో రాణించిన యూసుఫ్... తర్వాత ప్రభావం చూపించక పోవడంతో.. అతను వేలంలో అమ్ముడుపోలేదు. ఐపీఎల్‌లో గతంలో యూసుఫ్ పఠాన్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఇప్పుడు యూసుఫ్ పఠాన్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 13, 14న జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో యూసుఫ్ పఠాన్ పాల్గొనున్నాడని సమాచారం. 39 ఏళ్ల యూసుఫ్ పఠాన్... ప్రస్తుతం ఫామ్ పరంగా, ఫిట్‌నెస్ పరంగా మంచి స్థితిలో ఉన్నాడు. దీంతో కొన్ని ఫ్రాంచైజీలు ఈ మాజీ ఆల్‌రౌండర్ ను వేలంలో దకించుకోవడానికి చుస్తున్నాయట..!. నిన్న లెజెండ్స్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ తన పాత ఆట తీరుతో చెలరేగాడు. అందువల్ల యూసుఫ్‌ను కొనుగోలు చేయడానికి పలు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయని సమాచారం. అయితే లెజెండ్స్ లీగ్‌లో భాగంగా నిన్న ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజస్ తరఫున బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ చెలరేగి ఆడాడు. 176 పరుగుల లక్ష్య చేధనలో కేవలం 40 బంతుల్లో 80 పరుగులలు సాధించాడు. యూసఫ్ ఇన్నింగ్స్ లో మొత్తం 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో మొత్తంగా 174 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 29 3204 పరుగులతో పాటు... 42 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.