హమ్మయ్య.. ఎట్టకేలకు మనోళ్ళు గెలిచారు?

praveen
ప్రస్తుతం భారత్లో బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు. అచ్చం ఇలాగే లోకల్ గేమ్ కి నేషనల్ లెవల్లో గుర్తింపు తీసుకురావడానికి ప్రో కబడ్డీ లీగ్ తెర మీదికి వచ్చింది. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరణ పొందటంతో ఈ లీగ్ విజయం సాధించింది అని చెప్పాలి. ఇక ప్రాంతీయ జట్లుగా విడిపోయిన ఎంతో మంది భారత కబడ్డీ ఆటగాళ్లు ఆయా జట్ల తరపున  హోరా హోరీ గా బరిలోకి దిగుతు తలపడుతూ ఉంటారు.

 ఇక లోకల్ గేమ్ కావడం.. ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ఎప్పుడో ఓ సారి కబడ్డీ ఆడిన అనుభవం కూడా ఉండడంతో ఇక ఈ గేమ్ ని చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రతి ఒక్కరూ తామే నేరుగా మైదానంలో ఆడుతున్నాము అన్నట్లుగా మ్యాచ్ లో లీనమై పోతుంటారు. ఇకపోతే 2 ఏళ్ల తర్వాత ఇటీవలే ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. ఇక ఈ లీగ్లో భాగంగా భారీ అంచనాలతో బరిలోకి దిగింది తెలుగు టైటాన్స్ జట్టు.. ఇక జట్టులో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఉండడంతో ఈసారి తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ లో కప్పు కొట్టడం పక్క అని అందరూ అనుకున్నారు.

 కానీ ప్రతి మ్యాచ్ లో కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చింది తెలుగు టైటాన్స్ జట్టు. అయితే ఓడిపోవడం లేదంటే మ్యాచ్ టైగా ముగియడం లాంటిదే జరిగింది. 10 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్లో కూడా తెలుగు టైటాన్స్ జట్టు విజయం సాధించకపోవడంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. ఇటీవలే ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా తెలుగు టైటాన్స్ జట్టు పదకొండవ మ్యాచ్లో ఎట్టకేలకు విజయం సాధించింది. 35- 34 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ ఓడించి మొదటి విజయాన్ని నమోదు చేసింది తెలుగు టైటాన్స్ జట్టు. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీక్ పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ జట్టు చివర్లో 12వ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: