వార్నీ.. టెస్ట్ కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ ఇలా అన్నాడేంటి?

praveen
ఇటీవలే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత కోహ్లీ వారసుడిగా టెస్ట్ కెప్టెన్సీ చేపట్టబోయేది ఎవరు అన్న చర్చ మాత్రం ప్రస్తుతం ఊపందుకుంది. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్నా రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఒక కెప్టెన్ ఉండి టెస్టు ఫార్మాట్ కు మరో కెప్టెన్ ఉంటే భారత జట్టు మరింత సమర్థవంతంగా  పటిష్టంగా మారిపోతుందని గతంలో బిసిసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్సీపై రోహిత్ శర్మకు కాకుండా మరొకరికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 అదే సమయంలో ఫిట్నెస్ విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉండే రోహిత్ శర్మ కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతను పూర్తిస్థాయిలో న్యాయం చేయలేడు అంటూ కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  తరచు గాయాల బాధపడుతున్న రోహిత్ శర్మ కెప్టెన్గా ప్రతి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం కష్టమే అంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా లో కొనసాగుతున్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి.

 ఇద్దరిలో ఒకరికి బిసిసిఐ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది అంటూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్సీపై కె.ఎల్.రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియా పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్ కావడం గురించి ఆలోచించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు కె.ఎల్.రాహుల్. కానీ అవకాశం వస్తే మాత్రం సాధ్యమైనంత మెరుగ్గా జట్టును ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు చేస్తాను అంటూ తెలిపాడు. ఒక జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే ఏ ఆటగాడైనా కల నెరవేరడమే కదా అంటూ తెలిపాడు. కానీ పూర్తిస్థాయి కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదని కానీ అవకాశం వస్తే మాత్రం అదృష్టంగా భావిస్తాను అంటూ కె.ఎల్.రాహుల్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: