ఇదో విచిత్రం.. ఎలా వికెట్ కోల్పోయాడో చూడండి?

praveen
సాధారణంగా క్రికెట్లో స్టార్ ఆటగాళ్లు ఎంతో ఆచితూచి ఆడుతూ ఉంటారు. ఇక వారిని వికెట్ చేయడం బౌలర్లకు సవాల్తో కూడుకున్న పని. ఎంతో వైవిధ్యమైన బంతులను సంధిస్తూ వికెట్ పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా స్టార్ ఆటగాళ్లు వికెట్ కోల్పోయిన విధానం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా వికెట్ చేజార్చుకున్నాడు అంటూ అభిమానులు అందరూ షాక్ అవుతు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఆచితూచి ఆడుతున్న స్టార్ క్రికెటర్ అనుకోని విధంగా వికెట్లు కోల్పోవడం అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక టెస్టు సిరీస్ లో భాగంగా ప్రస్తుతం ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఐదొవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా అటు కంగారు జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలి పోతున్న సమయంలో లబుషేన్ ఇక జట్టుకు ఆశాదీపం గా నిలిచాడు. ఎంతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేశాడు. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖావజా లాంటి స్టార్ ప్లేయర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరారు.

 ఈ క్రమంలోనే క్రీజులోకి వచ్చిన లబుషేన్ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. 53 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇలా ఎంతో జోరుమీద ఆడుతున్న లబుషేన్ వికెట్ కోల్పోయిన విధానం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇన్నింగ్స్ లో భాగంగా స్టువర్ట్ బ్రాడ్ 23 ఓవర్ వేశాడు. ఇక ఆ సమయంలో ఎంతో జోరుగా బ్యాటింగ్ చేస్తున్నాడు లబుషేన్. అయితే 134.1 కిలోమీటర్ల స్పీడ్ తో బంతిని సంధించాడు స్టువర్ట్ బ్రాడ్. ఈక్రమంలోనే  లబుషేన్ ఒక్కసారిగా బొక్క బోర్లా పడిపోయాడు. ఇంకేముంది బంతి నేరుగా వికెట్లను తాకింది. ఇక ఇలా ఎలా వికెట్ అయ్యాడు అంటూ ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. లబుషేన్ వికెట్ కోల్పోవడంతో ఇక ఆస్ట్రేలియా జట్టుకు నిరాశ తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: