క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతూ ఉండటం ఒకవైపు అభిమానులను మరోవైపు తోటి ఆటగాళ్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. ఇటీవలే శ్రీలంక జట్టుకు చెందిన యువ క్రికెటర్లు ఏకంగా క్రికెట్కు గుడ్ బై చెబుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న క్రిస్ మోరిస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా అంటూ క్రిస్ మోరిస్ ఇటీవలే ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ ల నుంచి రిటైర్ అవుతున్నా అంటూ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు అన్ని రకాల ఫార్మాట్ల నుంచి నేను రిటైర్ అవుతున్నాను. నా ప్రయాణంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు  అంటూ తెలిపాడు. టైటాన్ కోచ్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎంతో సంతోషంగా నేను ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టి తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. కాగా క్రిస్ మోరిస్ లాంటి స్టార్ ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఇక దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

 ఇకపోతే 2013లో వన్డేలలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు క్రిస్ మోరిస్. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్తో టెస్టు ఫార్మాట్లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొత్తంగా క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున నాలుగు టెస్టు మ్యాచులు మాత్రమే ఆడాడు. 42 వన్డేలు 23 టి 20 మ్యాచ్లు ఆడాడు ఇక ఐపీఎల్ లో కూడా వివిధ జట్లలో ఆడి సత్తా చాటాడు క్రిస్ మోరిస్.. మొత్తం 81 మ్యాచ్ లు ఆడి 618 పరుగులు చేయడమే కాదు తొంబై ఐదు వికెట్లు కూడా పడగొట్టి ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: