వావ్.. హార్దిక్ పాండ్య కెప్టెన్ కాబోతున్నాడు?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కి ఎంతగానో గుర్తింపు ఉంది. ఇప్పటివరకు భారత క్రికెట్లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాన్ని అందించాడు హార్థిక్ పాండ్యా. ఒకవైపు బౌలింగ్లో అద్భుతంగా రాణించడమే కాదు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీసు లోకి వస్తూ తన బ్యాట్ తో అద్భుతాల సృష్టిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. ఏకంగా స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తోంది ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా సరిపోతుంది అని చెప్పాలి.

ఎందుకంటే చూడటానికి బక్కపలుచగా ఉండే హార్దిక్ పాండ్యా కొట్టే భారీ సిక్సర్లు  ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు లో ఆడుతున్న హార్దిక్ పాండ్యా 5 సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు. ఇకపోతే మెగా వేలం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వేలంలో కి వదిలేసింది.. ఇక ఐపీఎల్ 2022  సీజన్లో లక్నో, అహ్మదాబాద్ ప్రాంఛైజీలు ఐపీఎల్ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా వేలం గురించి ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 కాగా ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వ్యవహరించ పోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హార్దిక్ పాండ్యా కు దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టు తరపున ఆడిన అనుభవం ఎంతో ఉంది. ఈ క్రమంలోనే ఇక వచ్చే సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. కాగా ఇప్పటివరకు ఐపీఎల్లో 92 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా 153.91 స్ట్రైక్ రేట్ తో 1476 పరుగులు చేసి అదరగొట్టాడు. కానీ గత కొంత కాలం నుంచి సరైన ఫామ్ లో లేక ఇబ్బందులు పడుతున్నాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: