కోహ్లీ లాంటి ప్లేయర్.. విఫలమైన పర్వాలేదు : వార్నర్

praveen
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా ఎన్నో ఏళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. ఒకప్పుడు తన బ్యాటింగ్తో భారీగా పరుగులు చేస్తూ రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ ఇప్పుడు మాత్రం అనుకున్నంతగా రాణించలేక పోతున్నాడు. టీమ్ ఇండియా లో టెస్టు జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ  పామ్ మాత్రం జట్టును ఎంతగానో కలవరపెడుతోంది. ఎన్నోసార్లు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో విజయాలు అందించిన సత్తా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడం మాత్రం అభిమానులను నిరాశ పరుస్తోంది.

 ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు గడిచిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో విరాట్ కోహ్లీ మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చి అద్భుతంగా రాణించాలని భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నా.రు ఇక ఇటీవలే విరాట్ కోహ్లీ పేలవమైన ఫాంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్మెన్ విఫలం అయినా పర్వాలేదు అంటూ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు.

 ఇటీవలే బ్యాక్ స్టేజ్ విత్ బోరియా అనే కార్యక్రమంలో భాగంగా డేవిడ్ వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్న కోహ్లీ లాంటి ప్లేయర్ విఫలమైన పర్వాలేదు ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఆటగాడు ఇప్పుడు విఫలం అవడం అర్థం చేసుకోదగిన విషయమే. ఇక దీనికి విరాట్ కోహ్లీ పూర్తి అర్హత కలిగిన వాడు అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ కూడా గత నాలుగు ఇన్నింగ్స్ లో సెంచరీ చేయలేదు. కానీ స్మిత్ గణాంకాలు చూసుకుంటే నాలుగు ఇన్నింగ్స్ లకి  ఒక సెంచరీ చేస్తాడు అని మాత్రం చెబుతున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లకు కట్టిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ప్రతి ఒక్కరి పై అధిక ఒత్తిడి ఉంటుంది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: