బెన్ స్టోక్స్ బతికిపోయాడు.. మీరే చూడండి?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ జరుగుతుంది. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగు టెస్టుల సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు మూడు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఇక నామమాత్రమైన  నాల్గవ టెస్ట్ మ్యాచ్ వీటివల్ల ప్రారంభమైంది. ఇకపోతే మొదటినుంచి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది ఇంగ్లాండ్ జట్టు. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇటీవల జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.



 అయితే సాధారణంగా బౌలర్ వేసిన బంతి వికెట్లకు తాకి నప్పటికీ వికెట్ల పై ఉన్న బేయిల్స్ కింద పడకపోతే  మాత్రం నాట్ అవుట్ గా ప్రకటిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఇలా బంతి వికెట్లకు తాకినప్పటికీ బేయిల్స్ కింద పడకపోవడంతో చివరికి నాటౌట్ గా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవలే యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కి అదృష్టం కలిసివచ్చింది. వికెట్లకు  బంతి తగిలినా బెయిల్ కింద  పడకపోవడంతో చివరికి నాట్ అవుట్ గా ప్రకటించారు అంపైర్లు.


 టెస్ట్ లో భాగంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్న తొలి ఇన్నింగ్స్ సమయంలో తక్కువ పరుగులకే జోరూట్, డేవిడ్ మలన్ లాంటి కీలక వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చాడు బెన్ స్టోక్స్ ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆసీస్ బౌలర్ కామరూన్ గ్రీన్ వేసిన బంతిని స్ట్రోక్స్ వదిలేశాడు. అది కాస్త వికెట్లను తాకుతూ వెళ్ళిపోయింది. దీంతో ఆసిస్  జట్టు అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ ఎల్ బి డబ్ల్యు  అవుట్ గా ప్రకటించాడు. అయితే కాలికి బంతి తగలలేదు అంటూ రివ్యూ కి వెళ్ళాడు బెన్ స్టోక్స్. రివ్యూలో బంతి కాలికి తగలలేదు కాని వికెట్లకు తగినట్లుగా కనిపించింది. కానీ బెయిల్ కింద పడలేదు.దీంతో నాటౌట్గా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోతుంది. దీనిపై స్పందించిన సచిన్ బౌలర్లకు కూడా న్యాయం జరగాలి రూల్స్ లో కాస్త మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: