ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పై వేటు... ?

VAMSI
అంతర్జాతీయ క్రికెట్ లో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగడం అంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. ఇక ఒక ప్లేయర్ టెస్ట్ టీం కి కెప్టెన్ స్థానంలో ఉంటే ఇక ఆ ఒత్తిడి వేరే లెవెల్ లో ఉంటుంది. ఒక ప్లేయర్ గా ప్రతిభ చూపుతూనే జట్టులోని ప్లేయర్స్ నుండి సమిష్టి ప్రదర్శన రాబట్టగలగాలి. అప్పుడే ఆ కెప్టెన్ ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతాడు. ఈ రెండిటిలో ఎందులో అయినా ఫెయిల్ అయ్యారే ఇక అంతే విమర్శలు వెన్నంటే ఉంటాయి. సరిగా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఒక ఆటగాడు ఉన్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ జో రూట్ గత కొంతకాలంగా అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్ గా సక్సెస్ అవుతూ వచ్చాడు.
కానీ మొన్న ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ కావొచ్చు.. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ కావొచ్చు... జట్టు అంతా సమిష్టిగా విఫలం అయింది. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటి వరకు ముగిసిన మూడు టెస్ట్ లు ఇంగ్లాండ్ ఓడిపోవడం ఆ దేశ క్రికెటర్లను మరియు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇండియాతో సిరీస్ ఓడినా రూట్ అక్కడ వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అంతా మారిపోయింది. మొత్తం ఆరు ఇన్నింగ్స్ లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే ఓవరాల్ గా మంచి ప్రదర్శనే అయినప్పటికీ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
ఇక సిరీస్ లో మిగిలి ఉన్న రెండు టెస్ట్ లు ఎలాగయినా గెలిచి పరువును కాపాడుకోవాలని ఇంగ్లాండ్ జట్టు కసితో ఉంది. మరో వైపు ఆస్ట్రేలియా మిగిలిన రెండు టెస్ట్ లను గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టు ప్రదర్శనతో సంతృప్తిగా లేదు. అందుకే కెప్టెన్ జో రూట్ ను తొలగించాలని ఆలోచిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ సిరీస్ తర్వాత జో రూట్ కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా తెలియాలంటే ముందు జరగాల్సిన రెండు టెస్ట్ ల మీద ఆధారపడి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: