డికాక్ సడెన్ రిటైర్మెంట్... ఈ సమస్యే కారణమా?

VAMSI
క్రికెట్ లో మామూలుగా మూడు రకాల ఫార్మాట్ లు ఉన్నాయి. అందులో టెస్ట్, వన్ డే మరియు టీ 20 లు... ఆటగాడి సామర్థ్యాన్ని బట్టి ఆయా ఫార్మాట్ లకు సెలెక్ట్ కాబడి తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కొందరు ఆటగాళ్ళు అయితే మూడు ఫార్మాట్ లలోనూ ఆడుతూ ఉంటారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా ఇండియాకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సీరీస్ లో మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే లు ఆడనుంది. అయితే మూడు టెస్ట్ లలో భాగంగా మొదటి టెస్ట్ నిన్నటితో ముగిసింది. ఈ టెస్ట్ లో భారత్ 100 కుపైగా పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విజయభేరి మోగించింది.

సౌత్ ఆఫ్రికా జట్టులో ఎక్కువ మంది అనుభవం లేని ఆటగాళ్ళు ఉండడం వలన టీమ్ ఇండియా బౌలర్లను ఎదుర్కోలేక ఓటమి పాలైంది. అయితే ఓటమి నుండి తేరుకోక ముందే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ కు మరో షాక్ తగిలింది. సొంత ఆఫ్రికా జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ లలో అధ్బుతంగా రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డీకాక్ టెస్ట్ ల నుండి రిటైర్ అవనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇంతటి ప్రతిభ కలిగిన ఆటగాడు రిటైర్ అవ్వడం తన అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లను సైతం విచారంలో ముంచింది. అయితే డీకాక్ లో టెస్ట్ క్రికెట్ ఆడే వయసు ఇంకా ఉంది. అయినా ఎందుకు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని అంతా ఆలోచిస్తూ ఉన్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం టీమ్ ఇండియా తో ఓటమి పాలవ్వడం ఒక కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా జట్టులో ఆటగాళ్ళ మధ్య కూడా సరైన అనుబంధం లేదని, సీనియర్ లు అయిన డుప్లిసిస్, మోరిస్ మరియు తాహిర్ లాంటి ఆటగాళ్ళు లేకపోవడం ఒకింత ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని గాసిప్ లు వస్తున్నాయి. అయితే వన్ డే మరియు టీ 20 లకు అందుబాటులో ఉంటాడని చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా ఒక మంచి టెస్ట్ ఆటగాడి సేవలను సౌత్ ఆఫ్రికా క్రికెట్ కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: