హెరాల్డ్ ఫ్లాష్ 2021 : విరాట్ సెంచరి లేనేలేదు..!
సౌతాఫ్రికా తొలి టెస్టులో 94 బంతుల్లో 35, 32 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఈ సంవత్సరం కూడా విరాట్ కొహ్లీ 100 పరుగులు చేయలేదు. అయితే, 2020 లోనూ విరాట్ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో వరుసగా రెండు సంవత్సరాలు సెంచరీ చేయకుండా రికార్డుల్లోకి ఎక్కాడు కొహ్లీ. చివరిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ 100 పరుగులు చేశారు. దీంతో కొహ్లీ 70 సెంచరీల క్లబ్లో చేరాడు. ఈ సంవత్సంరలో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ ఒక్క సెంచరీ కూడా బాదకపోవడం గమనార్హం. అయితే, 5 హాఫ్ సెంచరీలు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్‌ల్లో ఆరంభంలో బాగా ఆడుతున్నా.. చివరి వరకు తన ఊపును కొనసాగించలేకపోతున్నాడు. 2020 లో 19.33 సగటుతో 116 పరుగులు చేసిన విరాట్.. 2021లో 28.21 సగటుతో 536 రన్స్ చేశారు. 2019లో 54.97 కెరీర్ సగటుతో పరుగులు చేశారు. ఇప్పటి వరకు 70 సెంచరీలు చేసిన విరాట్.. మరో సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు. అయితే, 2021 కొహ్లీకి తీవ్ర నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. అంతర్జాతీయ టీ20 లకు స్వస్తీ చెప్పిన కొహ్లీని, ఆ తరువాత ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌ల సారథ్యం నుంచి కూడా కొహ్లీని బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే.