షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. క్రికెట్ కు రిటైర్మెంట్?

praveen
సాధారణంగా ఆటగాళ్లు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు అన్నది అభిమానులకు ఊహకందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూన్న సమయంలోనే చివరికి క్రికెట్ కు వీడ్కోలు పలికి అభిమానులకు షాక్ ఇస్తారు ఎంతోమంది ఆటగాళ్లు.  ఇప్పుడు వరకు ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ తమ రిటైర్మెంట్ తో అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అదే కోవలోకి చేరిపోయాడు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్. న్యూజిలాండ్ జట్టులో అద్భుతంగా రాణిస్తూ ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు రాస్ టేలర్. న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన విజయాలు సాధించడంలో రాస్ టేలర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే రాస్ టేలర్ ఇంకా ఎన్నో ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని అభిమానులు భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇటీవల ట్విట్టర్ వేదికగా తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు రాస్ టేలర్. బంగ్లాదేశ్లో జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్లో, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ లో జరిగే ఆరు వన్ డే తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు  తెలిపాడు  ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. బంగ్లాదేశ్తో రెండో టెస్టులు.ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ తో 6 వన్డేలు ఆడిన తర్వాత  క్రికెట్ నుంచి తప్పుకుంటానని.. 17 సంవత్సరాల పాటు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపాడు.  దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ  క్రికెట్ ఆడటం ఎంతో గర్వం గా భావిస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు



 కాగా 2006 సంవత్సరంలో వెస్టిండీస్ పై జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు స్టార్ క్రికెటర్ రాస్ టేలర్. ఇప్పటివరకు రెండు వందల ముప్పై మూడు వన్డేల్లో 8576  పరుగులు చేశాడు. అదే సమయంలో అతడి వన్డే క్రికెట్ లో 21 సెంచరీలు కూడా సాధించాడు రాస్ టేలర్.  ఇక 102 టీ 20 లలో 1909 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 110 టెస్టుల్లో 7586 పరుగులు చేశాడు రాస్ టేలర్ . అయితే ఒక్కసారిగా రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించడం తో అభిమానులను నిరాశ లో మునిగి పోయారు అని చెప్పాలి. మరి కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: